ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థినికి రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్
1 min read
ప్రతి విద్యా సంవత్సరానికి 50 వేల రూపాయలు రిలయన్స్ స్కాలర్షిప్ ఆర్థిక సాయం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆదిత్య డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బి. జ్యోత్స్న తన అసాధారణమైన విద్యా ప్రతిభ, కృషి, నిబద్ధతకు గుర్తింపుగా దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన రిలయన్స్ ఫౌం డేషన్ స్కాలర్షిప్ను సాధించి కళాశాల ప్రతిష్టను మరింత పెంచారు. ప్రతిభావంతులైన విద్యార్థు లకు ఉన్నత విద్యలో ఆర్థిక భరోసా కల్పించి, వారి కలలను సాకారం చేయాలనే లక్ష్యంతో రిలయన్స్ ఫౌండేషన్ అందించే ఈ స్కాలర్షిప్ ద్వారా ప్రతి విద్యా సంవత్సరానికి రూ.50,000 చొప్పున ఆర్థిక సహాయం అందనుంది. వేలాది దరఖాస్తుల మధ్య నుంచి ఎంపిక కావడం విద్యార్థిని బి.జ్యోత్స్న యొక్క నిరంతర కృషికి, పట్టుదలకు, అంకితభావానికి నిదర్శనమని కళాశాల ఈ సందర్భంగా కళా శాల చైర్మన్ డా: నల్లమిల్లి శేషారెడ్డి, సెక్రటరీ డా: నల్లమిల్లి సుగుణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ డా: బి.ఈ.వి.ఎల్. నాయుడు, ప్రిన్సిపల్ జి.చంద్రరావు,వైస్ ప్రిన్సిపల్ వి.సుభాష్ విద్యా ర్థిని అభినందించి,భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షంచా రు.ఈ విజయం శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మరింత ప్రేరణగా నిలవడమే కాకుండా,నాణ్యమైన విద్యకు కళా శాల నిలయమనే విషయాన్ని మరోసారి నిరూ పించిందని కళాశాల యాజమాన్యం పేర్కొంది.

