NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాఘవేంద్రుని సన్నిధి లో శంబాల హీరోయిన్ అర్చన అయ్యర్

1 min read

మంత్రాలయం,  న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు శంబాల చిత్రం హీరోయిన్ అర్చన అయ్యర్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం వచ్చారు. వీరికి టిడిపి యువ నాయకులు సతీష్ నాయుడు, కౌతాళం మండలం టిడిపి అధ్యక్షులు సురేష్ నాయుడు,  వరదరాజులు స్వాగతం పలికారు. మంత్రాలయం టిడిపి ఇంచార్జీ  రాఘవేంద్ర రెడ్డి  పిలుపు మేరకు వారికి  కుటుంబ సభ్యులకు సంప్రదాయ ప్రకారం ముందుగా మంచాలమ్మ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చన అయ్యర్ కుటుంబ సభ్యులు  మంత్రాలయం నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు  తెలియజేశారు. ఇక్కడ ప్రజలు ఎంతో ఆప్యాయంగా పలకరించి ప్రేమను పంచుతారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో  తెలుగు యువత బీమా, మౌనేష్,నాగరాజు, రఘు తదితరులు పాల్గొన్నారు.

About Author