మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమన్వయంతో విజయవంతం చేయాలి
1 min read
ఖచ్చితమైన ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
భక్తులకు సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన దర్శనం కల్పించాలి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి
శ్రీశైలం / నంద్యాల, న్యూస్ నేడు: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మహాక్షేత్రానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, స్వామి-అమ్మవార్లను సౌకర్యవంతంగా దర్శించుకునేలా ఖచ్చితమైన ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీశైల దేవస్థానం అన్నప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్తో కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, ఆత్మకూరు, దోర్నాల, శ్రీశైలం డీఎఫ్వోలు విగ్నేష్ అపోవా, నీరజ్, భవిత కుమారి, ట్రస్ట్ బోర్డు సభ్యులు భరద్వాజ శర్మ, అనిల్ కుమార్, గుండ్ల గంగమ్మ, కాశీనాథ్, రేఖ గౌడ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఫిబ్రవరి 8 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో దేవస్థానం సిబ్బంది, పోలీస్, జిల్లా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైన, సంతృప్తికరమైన దర్శనం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది సుమారు 20 శాతం మేర అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అదనపు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, త్రాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, రవాణా, క్యూలైన్ల నిర్వహణ, భక్తులకు శీఘ్రంగా సౌకర్యవంతమైన దర్శనం వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా పనులు చేపట్టాలని అధికారులను సూచించారు. శ్రీశైల పరిసర ప్రాంతాలను 11 జోన్లుగా విభజించి, ప్రతి జోన్కు ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షణతో పాటు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్య పనులు నిరంతరంగా కొనసాగించేలా 24 గంటలు మూడు షిఫ్టులుగా శానిటేషన్ సిబ్బందిని నియమించాలని డీపీఓను ఆదేశించారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న మలుపుల వద్ద అద్దాలు ఏర్పాటు చేయడంతో పాటు, సమాచార సూచిక బోర్డులను ఏర్పాటుదేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, శ్రీశైలంలో భక్తుల కోసం చేపట్టిన ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ట్రాఫిక్ అంతరాయాలను తొలగించేందుకు 7 ప్రదేశాల్లో హైడ్రాలిక్ క్రేన్లు, రికవరీ వ్యాన్లను అందుబాటులో ఉంచామన్నారు. వాహనాల రద్దీ నియంత్రణకు 27 ఎకరాల విస్తీర్ణంలో 5,450 వాహనాలు పార్కింగ్ చేయగల సదుపాయాన్ని కల్పించనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 36 లక్షల లడ్డు ప్రసాదాలను తయారు చేయడంతో పాటు, వాటి పంపిణీ కోసం 15 లడ్డు ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

