స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అభివాదం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాల మరియు జి పులయ్య ఇంజనీరింగ్ కళాశాలలు సంయుక్తంగా, అధ్యాపకులు మరియు విద్యార్థులు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాజవిహార్ సర్కిల్, కుర్నూల్లో వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి రవీంద్ర విద్యాసంస్థల అధినేత శ్రీ జి. పుల్లయ్య గారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా యువతకు సందేశం ఇస్తూ, స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలను గుర్తు చేశారు: “లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి” అనే వచనాన్ని యువతకు గుర్తుచేసి ఇలాంటి ఎన్నో గొప్ప ఆలోచన రేకెత్తించే స్ఫూర్తి వచనాలను విద్యార్థులు తెలుసుకొని వాటిని స్ఫూర్తిగా తీసుకొని, తమ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కోరారు.దేశ యువతే రేపటి భారతానికి పునాది అన్న నమ్మకాన్ని వివేకానందుడు ఎప్పుడో వ్యక్తం చేశారు. యువ మనస్సుల్లో దాగి ఉన్న నైతిక, మేధో, సామాజిక శక్తే దేశ గమనాన్ని మార్చగలదని ఆయన విశ్వసించాడు. అందుకే ఆయన విద్యపై పెట్టిన దృష్టి కేవలం పాఠ్యాంశాలు, పరీక్షల వరకే పరిమితం కాలేదు. వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యం ఇవే నిజమైన విద్య లక్ష్యాలని ఆయన స్పష్టంగా చెప్పారు. నేడు వేగంగా మారుతున్న ప్రపంచంలో ఈ ఆలోచనలు మరింత ప్రాసంగికంగా మారాయి.యువత తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని యువతకు ఆకాశమే హద్దని స్వామి వివేకానంద గారిని చూసి యువత తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. అందుకే ఈ రోజున జాతీయ యువజన దినోత్సవంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాము అన్నారు.ఈ కార్యక్రమంలో డీన్లు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

