సచివాలయం లను తనిఖీ చేసిన ఎంపిడిఓ
1 min read

వెలుగోడు, న్యూస్ నేడు: వెలుగోడు పట్టణం లోని 1 నుంచి 5 సచివాలయం లను ఎంపిడిఓ మధుసూధనరెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. మండలం జిఎస్ డబ్ల్యూఎస్ ఆఫీసర్ చాంద్ బాషా సందర్శించి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ను ఇంటింటికి వెళ్లి చేయాలని , మిగిలిన ఈ -కెఈవై సిటిజన్ సర్వే కూడా వేగవంతం చేయాలని సిబ్బంది ని ఆదేశించారు. యూనిఫైడ్ సర్వే, వాట్సాప్ గవెర్నన్స్ సర్వే , సిటిజన్ సర్వే లపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సచివాలయం సిబ్బంది సమయపాలన పాటించాలని , కొందరు సంతకం చేసి బయటికి వెళ్లి పోతున్నారని , అటువంటి సిబ్బంది పై చర్యలు ఉంటాయని తెలిపారు.

