కబడ్డీ క్రీడాకారులకు టీ షర్ట్ లు పంపిణీ..
1 min read

యువ నాయకులు దొరబాబు రెడ్డి టీ షర్టులు అందజేత
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తరిగోపుల గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన కబడ్డీ పోటీల కార్యక్రమంలో పాల్గొనే 15 మంది కబడ్డీ క్రీడాకారులకు శుక్రవారం గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకులు మందడి దొరబాబు రెడ్డి క్రీడాకారులకు టీ షర్టులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన క్రీడాకారులు పోటీల్లో మంచి ప్రతిభ చాటుతూ మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులను దొరబాబు రెడ్డి క్రీడాకారులను కోరారు.ఈ సందర్భంగా గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతలో క్రమశిక్షణ ఆరోగ్యం నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి యువ నాయకులు కోట్ల సంతోష్ కుమార్ రెడ్డి,ఎల్లమ్మ నాయుడు,శేఖర్,నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

