జై జవాన్ వెల్ఫేర్ అసోసియేషన్ స్వచ్ఛంద రక్తదాన శిబిరం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఇండియన్ ఆర్మీ డే పురస్కరించుకొని జై జవాన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు 16 జనవరి 2026 రోజున స్వచ్ఛంద రక్తదాన శిబిరం కర్నూల్ బ్లడ్ బ్యాంకులో సగరవంగా గౌరవనీయులైన గ్రూపు సభ్యులైనటువంటి ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా మహా ప్రారంభోత్సవం జరిగినది.తదనంతరం కార్యక్రమం సజావుగా, నిరాడంబరంగా మరియు క్రమానుసారంగా దాదాపు జవాను బృందము ఈ కార్యక్రమంలో 20 మంది దాకా పాల్గొన్నారు. దేశ సేవ చేస్తూనే తమ వంతు తమ సొంత గడ్డకు కూడా సేవ చేసుకోవాలన్న నిస్వార్థ సేవతో తమ గడ్డకు సేవ చేసుకునేందుకు ఎల్లవేళల ముందు ఉంటామని సైనికుల కుటుంబాలకు మరియు అదేవిధంగా నిరుపేదలైనటువంటి వారికి అత్యవసర పరిస్థితుల్లో మా స్వచ్ఛంద రక్తదాన శిబిరంని వినియోగించుకోవలసినదిగా వారు సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మరియు సభ్యులు.


