NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన ఏలూరు ఎమ్మెల్యే కి అభినందన వెల్లువ

1 min read

అభినందనలు తెలియజేసిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి అభినందనల వెల్లువ కొనసాగుతోంది. దీనిలో బాగంగా ఏలూరు పవర్‌ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా పార్టీ అధ్యక్షులు బడేటి చంటిని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాథాకృష్ణ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్చం అందించి అభినందించారు. అనంతరం వారిరువురూ కొద్దిసేపు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై చర్చించుకున్నారు. ఇదేసమయంలో పలువురు టిడిపి నాయకులు,కార్యకర్తలు, సంఘాల ప్రతినిధులు, అధికారులు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలుసుకుని, పుష్పగుచ్చాలు, జ్ఞాపికలు అందించి అభినందించారు.దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

About Author