NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహా సభను జయప్రదం చెయ్యండి

1 min read

ఏపీ జేఏసీ అమరావతి,ఏలూరు జిల్లా చైర్మన్ కె.రమేష్ కుమార్

ఏపీ జెఎసి అమరావతి,4వ రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక ఏలూరు రెవిన్యూ భవన్ లో ఫిబ్రవరి 5 వ తేదిన విజయవాడలో గల తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరుగబోయే ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహా సభను జయప్రదం చేయాలని కోరుతూ  పోస్టర్ ను  అవిస్కరించడమైనది. సదరు కార్యక్రమములో ఏపీ జేఏసీ అమరావతి, ఏలూరు జిల్లా చైర్మన్ కె.రమేష్ కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి 5 వ తేదిన విజయవాడలో గల తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరుగబోయే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహా సభకు ఏలూరు జిల్లాలో గల ఉద్యోగులు, ఉపాద్యాయలు, సచివాలయ ఉద్యోగులు,కార్మిక లు,పెన్షనర్లు, కాంట్రాక్టు & ఔట్సొర్సింగ్ ఉద్యోగులు అందరు సదరు సభకు హాజరయ్యి జయప్రదము చెయ్యాలని కోరియున్నారు. సదరు సభకు తరలి వెళ్ళడానికి ఏలూరు నుండి ది.05.02.2026 తేది ఉ.06.00 గ లకు స్థానిక రెవిన్యూ భవనము నుండి బస్సు లు ఏర్పాటు చెయ్యడము జరిగినవి. సదరు సభకు ముఖ్య అతిధులుగా ఆర్థిక శాఖామాత్యులు పయ్యావుల కేశవ్, పౌర సరఫరా శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్,వైద్య ఆరోగ్య శాఖామాత్యులు సత్య కుమార్ యాదవ్ పాల్గొంటున్నారు. కాబట్టి మన ఏలూరు జిల్లా నుండి సదరు సభకు వేలాదిగా తరలి వెళ్లి ఉద్యోగులకు రావల్సిన బకాయిలు, 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి తదితర ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారాల కొరకు మన గళం వినిపించాలని తెల్పినారు. సదరు కార్యక్రమములో ఏపీ జేఏసీ అమరావతి జనరల్ సెక్రెటరి బి. రాంబాబు, రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి  ఏ. ప్రమోద్ కుమార్, ఏపిపిటిడిఏ అధ్యక్షులు వై శ్రీనివాస్,(వై ఎస్) పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మహాలక్ష్మిడు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా వైస్  ప్రెసిడెంట్ ప్రభాకర్,ఏలూరు డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణ స్వామి, వివిధ సంఘాల నాయకులూ పాల్గొన్నారు.

About Author