NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

1 min read

శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి

ఏపీ మోడల్ స్కూల్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే

స్కూల్ అంతర్గత సిసి రోడ్ల నిర్మాణానికి 9 లక్షల వ్యయంతో భూమి పూజ

వెలుగోడు, న్యూస్​ నేడు:    విద్య అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తెలిపారు మంగళవారం వెలుగోడు మండల పరిధిలోని ఏపీ మోడల్ స్కూల్ లో వార్షికోత్సవ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలని జయంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు విద్యతోనే రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి ముడిపడి ఉంటుందని ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు ముఖ్యంగా విద్యతోపాటు బాషల పైన పట్టు సాధించాలని ప్రాంతాలపై ఒక పట్టు సాధించాలని విద్యార్థులు అప్పుడే సమాజంలో నిలదుకొని నిలబడగ సైర్యం ఉంటుందని తెలిపారు క్రమశిక్షణతో కూడిన చదువు విద్యార్థుల జీవితాల్లో మార్పులు తీసుకొస్తుందని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అహర్నిశలు శ్రమించి బడికి పంపిస్తుంటారని వారి కలల ఆశయాల సాధన కోసం విద్యార్థులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో ఎక్కడలేని విధంగా ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం అమలు చేస్తుందని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యంలో సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం అంటే ఈ ప్రభుత్వానికి విద్యారంగంపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని తెలిపారు ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యాశాఖ సమర్థవంతంగా ఉందని  మెగా డీఎస్సీ పరీక్ష నిర్వహించి ప్రతి పాఠశాలలో టీచర్లను నియమించడం గొప్ప చరిత్రని తెలిపారు రాజకీయ నాయకులకు చాలా పనులు ఉంటాయని అయితే విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమంలో ఒక రెండు గంటలు పాల్గొన్న కూడా వారు ఆ ఒత్తిళ్ళను జయించి మరి రెట్టింపు ఉత్సాహంతో రాజకీయ నాయకులు పనిచేయడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే క్రింద కూర్చొని ఫోటో దిగారు అదేవిధంగా పాఠశాలకు సంబంధించిన సమస్యలపై చర్చించి దాదాపు తొమ్మిది లక్షల రూపాయలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం భూమి పూజ చేయడం జరిగిందని కోతుల బెడద నుండి విద్యార్థులను కాపాడడం కోసం పాఠశాల మొత్తం ఐరన్ మెస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు అదేవిధంగా అసంతృప్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వం తీసుకుపోతామని పేర్కొన్నారు  కార్యక్రమంలో ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఎం నళిని మండల అభివృద్ధి అధికారి మధుసూదన్ రెడ్డి ఆర్ఐ. సత్యనారాయణ రెడ్డి విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ సింగిల్ విండో చైర్మన్ మాండ్ల శంకర్ రెడ్డి టిడిపి సమన్వయకర్త అన్నారపు శేశరెడ్డి టిడిపి మండల అధ్యక్షుడు ఎంఏ కలాం మాజీ ఎంపీపీ ఎల్లాల కృష్ణుడు టిడిపి పట్టణ అధ్యక్షుడు రసూల్ ఖాన్ టిడిపి నాయకులు జాకెట్ హుస్సేన్ ఇంతియాజ్ రఘుస్వామి రెడ్డి నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author