మున్సిపాలిటీ మేనేజర్,ఏఈ కి అవార్డులు
1 min read

ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ,ఎంఈఓ సుభాన్ కు ప్రశంసా పత్రాలు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పురపాలక శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరికీ ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు.వారిలో మున్సిపాలిటీ మేనేజర్ సుహ్రులత మరియు అసిస్టెంట్ ఇంజనీర్ బి.దినేష్ కుమార్ లు ఉత్తమ అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా నందికొట్కూరు ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, పగిడ్యాల మండల విద్యాశాఖ అధికారి సుభాన్ లకు నంద్యాల జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి,ఎస్పీ సునీల్ షెరాన్ మరియు జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ ఉత్తమ ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బంది మేనేజర్ మరియు అసిస్టెంట్ ఇంజనీర్ ను మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి మరియు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

