NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏడిఏ  కి వ్యవసాయ శాఖ ఉద్యోగుల సంఘ పక్షాన సన్మానం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: వ్యవసాయ సహాయ సంచాలకులు, రెగ్యులర్, కర్నూలు అయిన శ్రీ ఎన్ సాలు రెడ్డిని వ్యవసాయ శాఖ ఉద్యోగుల సర్వీస్ సంఘం కర్నూలు జిల్లా సంఘం పక్షాన జిల్లా కార్యదర్శి ఎం. సి .కాశన్న ఆధ్వర్యంలో నిన్న జనవరి 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ   ఏడిఏ  గా మరియు వ్యవసాయ శాఖ జిల్లాకు సంబంధించి ఉత్తమ శకటము మొదటి బహుమతి సాధించడంలో కీలక పాత్ర వహించిన ఏడిఏ  కి వ్యవసాయ శాఖ ఉద్యోగుల సంఘ పక్షాన శాలువతో పూలమాలతో సన్మానించడం జరిగినది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు చాంద్బాషా, ఆంధ్రప్రదేశ్ టైపిస్టు మరియు స్టెనోగ్రాఫర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్, వ్యవసాయ అధికారి శ్రీనివాస్ మరియు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడీఏ  కూడా ఈ మొదటి బహుమతి సాధించడంలో వ్యవసాయ అధికారులు వ్యవసాయ శాఖ సిబ్బంది అందించిన సహకారం మరువలేనిది అని అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

About Author