జైల్లో బాధితులను పరామర్శించిన మాల మహానాడు
1 min read

నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం జానాల గూడెంకు చెందిన మాలలు నందికొట్కూరు సబ్ జైల్లో ఉండటంతో వారిని బుధవారం నందికొట్కూరు మాల మహానాడు నాయకులు జైల్లో పరామర్శించారు.ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు డాక్టర్ వెంకటేష్,మధు, బండారు శ్రీనివాసులు మాట్లాడుతూఘర్షణకు దారితీసిన పరిస్థితులు న్యాయం కోసం పోరాటం గురించి వారితో మాట్లాడడం జరిగిందని బాధితులు,మేము జైల్లో మా ఆడవాళ్లు ఊర్లో బిక్కు,బిక్కు మంటూ ప్రానాలను హరిచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారని అన్నారు.జానాల గూడెంలో కరెంట్ మూడు నెలల క్రిందట వచ్చింది.రోడ్లు సక్రమంగా లేవు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదని వారి జీవనాధారం ఇంజిన్ బోట్ జానాల గూడెం నుండి సోమశిలకు ప్రయాణికులను అవతలికి, ఇవతలికి దాటించి మా జీవనం గడుపుతున్నారని జీవనోపాధి అయిన ఇంజిన్ బోట్ వేయకుండా అగ్రవర్ణాల వారు అడ్డుకొని మాలాల కడుపు కొడుతున్నారు.ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న జీవన వృత్తి బోట్ వేసుకుంటున్నారని బాధితులు కన్నీటి పర్యంతం అయినట్లు వారు తెలిపారు.బాధితులకు అండగా న్యాయపోరాటం చేస్తాం ధైర్యంగా ఉండాలని బాధితులకు చెప్పారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఆరే రాజు,రవికుమార్.చెరుకు నడిపెన్న,బాధితుల బంధువులు రామేశ్వర్ఏసేపు,కురుమయ్య పాల్గొన్నారు.

