NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రహదారి ప్రమాదాల నివారణపై వాహనదారులకు అవగాహన

1 min read

హెల్మెట్ లేని వాహందారులకు వెంటనే హెల్మెట్ ఏర్పాటు

నిర్లక్ష్యంతో అశ్రద్ధతో వాహనాలు నడిపితే కుటుంబాలు విచ్ఛన్నమవుతాయి

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు నూజివీడు డిఎస్పీ కె వి వి ఎన్ వి ప్రసాద్ యొక్క ఆదేశాలపై పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ యొక్క ఆధ్వర్యంలో పెదపాడు ఎస్సై ఆర్.శ్రీనివాస్ వారి యొక్క సిబ్బందితో కలిసి రహదారి ప్రమాదాల నివారణ కొరకు కలపర్రు టోల్ గేట్ వద్ద హెల్మెట్ అవగాహన ను ద్విచక్ర వాహనదారులకు కల్పించరు. హెల్మెట్ లేనటువంటి ద్విచక్ర వాహనదారులు హైవేలపై ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరమని ఏదైనా ప్రమాదం జరిగితే అది ప్రాణానికి హాని అని తెలియజేసారు. హెల్మెట్ లేనటువంటి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను అక్కడకక్కడే కొనుగోలు చేయించి వారికి హెల్మెట్లు ధరించడం గురించి  పెదపాడు ఎస్సై ఆర్ శ్రీనివాస్ పలు సూచనలు సలహాలు వాహనదారులకు  అందజేశారు.కారులో ప్రయాణం చేసేటటువంటి వారు సీట్ బెల్ట్ లు తప్పక ధరించాలని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ల కలిగి ఉండాలని,రహదారి నియమ నిబంధనలను పాటిస్తూ గబ్యస్థానాలకు సురక్షితంగా చేరాలని మీ కొరకు మీ కుటుంబం ఎదురుచూస్తూ ఉంటుందని అశ్రద్ధ నిర్లక్ష్యం ద్వారా వాహనాలు నడిపితే మీకే కాకుండా ఎదుటివారికి కూడా ప్రాణహాని కలుగుతుందని ప్రతి ఒక్కరూ గ్రహించాలనికోరారు.వాహనాలను నిర్లక్ష్యంగా అతివేగంగా నడపడం వలన ఏ తప్పు చేయనటువంటి వారికి కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాల నివారణ కొరకు ప్రతి ఒక్కరు బాధ్యతతో జాగ్రత్తగా వాహనాలను నడపాలని ఈ సందర్భంగా ప్రజలకు అవగాహనను పెదపాడు ఎస్సై ఆర్.శ్రీనివాస్ కల్పించారు.

About Author