ఏడేళ్ల మైగ్రేన్ బాధకు చెక్..
1 min read

ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రిలో నాడీ చికిత్సతో మహిళలకు ఉపశమనం
హైదరాబాద్, న్యూస్ నేడు: దీర్ఘకాలంగా మైగ్రేన్‌తో బాధపడుతూ సాధారణ మందులకు స్పందించని రోగులకు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్‌పేట్లో అందిస్తున్న ఆధునిక చికిత్సలు కొత్త ఆశను కలిగిస్తున్నాయని న్యూరాలజిస్టులు తెలిపారు. ముఖ్యంగా గ్రేటర్ ఆక్సిపిటల్ నర్వ్ బ్లాక్ వంటి ఇంటర్వెన్షనల్ విధానాలు క్లిష్టమైన మైగ్రేన్ కేసుల్లో మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ఈ వివరాలను బుధవారం రోజు వెల్లడించారు.ఖమ్మం జిల్లాకు చెందిన 36 ఏళ్ల గృహిణి, గత ఏడు సంవత్సరాలుగా రోజూ మైగ్రేన్ తరహా తలనొప్పులతో బాధపడుతూ పలు మందులు వాడినా ఉపశమనం లేకుండా జీవితం గడిపింది. ఈ సమస్య ఆమె దైనందిన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. నవంబర్ 2025లో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్‌లో ఆమెకు బ్లాక్ చికిత్స చేయగా, తలనొప్పి రోజులు గణనీయంగా తగ్గాయి. అనంతరం మందుల మోతాదును కూడా క్రమంగా తగ్గించగలిగారుశాతం తగ్గినట్లు ఆమె వెల్లడించారు.నిద్ర నియమాలు, నీటి సేవనం, ఒత్తిడి నియంత్రణ, ఆహార నియమాలు వంటి జీవనశైలి మార్పులతో పాటు, అవసరమైనప్పుడు బ్లాక్స్ మరియు బోటాక్స్ ఇంజెక్షన్లు వంటి ఆధునిక చికిత్సలు మైగ్రేన్ నియంత్రణలో కీలకంగా మారుతున్నాయని వైద్యులు తెలిపారు. ఇవి తక్కువ సమయంలో పూర్తయ్యే అవుట్‌పేషెంట్ చికిత్సలు కావడం విశేషం.


