సీఎం సహాయ నిధి చెక్కు అందజేసిన పత్తికొండ ఎమ్మెల్యే
1 min read

పత్తికొండ , న్యూస్ నేడు: పత్తికొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం పత్తికొండ నియోజకవర్గ శాసనసభ్యులు కేఈ శ్యాం కుమార్ చేతుల మీదుగా భోయ లక్ష్మన్న (మరణాంతరం) భార్య భోయ సరస్వతికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద లక్ష రూపాయల చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ మాట్లాడుతూ, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములై నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తల కుటుంబాలను ప్రభుత్వం ఎప్పటికీ విస్మరించదని స్పష్టం చేశారు. పార్టీ క్రియాశీలక కార్యకర్తగా భోయ లక్ష్మన్న ప్రజల మధ్య నిలిచి సేవలు అందించారని, ఆయన అకస్మాత్తు మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. అలాంటి కార్యకర్త కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక భరోసాగా ఈ సహాయం అందించడం గర్వకారణమన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో అమలు అవుతున్న సంక్షేమ పాలన ప్రతి అర్హ కుటుంబానికి చేరుతున్నదానికి ఇదే నిదర్శనమని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారుఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు చక్రాల ముని నాయుడు, రామానాయుడు, మునిస్వామితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.

