తిరుపతిలో అవార్డు అందుకున్న తిరుమల శెట్టి ఉమా శంకర్
1 min read

తిరుపతి, న్యూస్ నేడు: తిరుపతి జిల్లా తిరుపతి కేంద్రంగా సేవా కార్యక్రమాలకు నిలయమైన శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ ప్రధమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి పట్టణంలో శుక్రవారం మహతి ఆడిటోరియంనందు జాతీయ ఉత్తమ సేవా రత్న పురస్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి పట్టణానికి చెందిన పలువురు మేధావులు ఆధ్యాత్మికవేత్తలు సేవా తత్పరులు పురపాలక శాఖ జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు అధికారులుముఖ్య అతిథులుగా పాల్గొని ఇందులో భాగంగా గుంటూరుజిల్లా పొన్నూరు పట్నానికి చెందిన మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల శెట్టి ఉమాశంకర్ కి చిలకపాటి సింహాద్రి కి శ్రీపతి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ నరసింహులుముఖ్య అతిధుల చేతులమీదుగా శాలువాతో షీల్డ్ మరియు ప్రశంసా పత్రాన్నిఅందజేసి అత్యంత ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మన పొన్నూరు బ్లడ్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరుమల శెట్టి ఉమాశంకర్ గత 10సంవత్సరాలుగా సంస్థ వారు నిస్వార్ధంగా నిరుపేద ప్రజలకు సేవలు అందిస్తూ.. ఘనంగా సేవలందిస్తూ ఎంతోమంది రక్తదాతలు అన్నదాతలు మా టీం సభ్యులకు మమ్ము కన్నా తల్లిదండ్రులకు ఈ అవార్డు అంకితం మేము ఈరోజు ఇలా పలు గుర్తింపులు పొందుతున్నాము అంటే అది దాతల సహకారమే.


