NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకోవాలి

1 min read

హోళగుందన్యూస్ నేడు:  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత, అసభ్య వ్యాఖ్యలను టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ , టిడిపి రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి ఆదాం, టీడీపీ మండల మైనారిటీ అధ్యక్షుడు ముల్లా మోయిన్, మండల కో కన్వీనర్ జాకీర్, సొసైటీ డైరెక్టర్ దుర్గయ, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ పంపాపతి, దిడ్డి వెంకటేష్, ల్యాబ్ గిరి, రామాంజీనీ తదితరులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని, లేనిపక్షంలో రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి, నాలుగు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు  నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంటే, ఆ విజయాన్ని ఓర్వలేక వైసీపీ నాయకులు బూతుల పురాణంతో చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.రాజకీయంగా విమర్శలు చేయాలంటే పాలన, విధానాలపై చేయాలని, కానీ వ్యక్తిగత దూషణలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని అన్నారు. ముఖ్యంగా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నేతపై ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగిస్తుందని హెచ్చరించారు. ఇలాంటి బూతు రాజకీయ సంస్కృతిని ప్రోత్సహించే నేతలను రాజకీయంగా బహిష్కరించాలని, అవసరమైతే ఇలాంటి పార్టీలపై ఎన్నికల సంఘం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు.. ఈ కార్యక్రమశీలో చిన్నహ్యాట సర్పంచ్ హేసన్ దిడ్డి నాగప్ప, వెంకటేష్, రారవి సిద్ధూ, ఇబ్బదుల్లా, ఆలం, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

About Author