NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా శ్రీ మడివేల మాచిదేవ జయంతి వేడుకలు…

1 min read

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండల రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడివాల మచిదేవదేవును చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం   జరిగింది. ఈ కార్యక్రమాన్ని ద్వేషించి నాయకులు మాట్లాడుతూ భారతీయ పురాణాలు మడేలయ్య తన యొక్క పాపపరిహారం తీర్చుకోవటానికి సుర ముప్పది మూడు కోట్ల దేవతలు మునులు విడిచిన వస్త్రాలను 12 సంవత్సరాలు శుద్ధి చేస్తాడు. ఒక రోజున శివుడు మడేలయ్య వృత్తిని పరీక్షించేందుకు తన పులి చర్మంతోపాటు తాను కప్పుకునే బొంతను పిండ మని కోరుతాడు. ఆ బొంత 33 గజాల పొడవుతో అందులో చీర పేన్లు, నల్లులు 101 జంతువులు ఉన్నాయని వాటిని చాపకుండా పిండటం నీ తరం కాదని చెప్తాడు. అయినప్పటికీ మడేలయ్య పిండు తానని బయలుదేరుతాడు. అప్పుడు మడేలయ్య ఏనుగు మీద బొంతను వేసుకొని నీటి కోసం లోకాలన్నీ తిరిగినా కనిపించవు. ఎందుకంటే అప్పటికే పరమ శివుడు నీటిని మాయం చేస్తాడు. అప్పుడు శీతలాదేవి పరమశివుడు పెట్టిన పరీక్షను ఎలాగైనా నెగ్గాలని మన వృత్తి ధర్మాన్ని పాటించాలని మడేలయ్యతో నన్ను సంహరించి నా అవయవాలతో బొంతను పిండి పరమశివుని కోరిక తీర్చాలని కోరుతుంది. అతను శివుని గురించి అని చెప్పగా అయితే ‘నన్ను నీ భుజాలమీద ఎక్కించుకొని తీసుకుపోతే, నేను శివున్ని చూపిస్తా అంటారు. అలా అతన్ని భుజాలమీద ఎక్కించుకొని వెళ్తుండగా ఉన్నట్టుండి అతను బరువు పెరిగి పోతాడు. అప్పుడు మదేలయ్య అతని బరువు మోయలేక కిందకు దించుతాడు వెంటనే అతను మాయమైపోతాడు అంతలో ఎదురుగా వస్తున్నా వ్యక్తి మడేలయ్య తో నువ్వు నీ భార్య వెళ్లారు వచ్చేటప్పుడు ఒక్కడివే వస్తున్నవేంటని అడుగుతాడు అప్పుడు మడేలయ్య జరిగిన విషయమొత్తం చెప్తుండగా అతను ఒకసారి వెనక్కి తిరిగి చూడమన్నాడు. …. అతను వెనక్కి తిరిగి చూడగానే శీతలా దేవి కనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో కురుకుంద నాగరాజు.లక్ష్మణ ఎల్ఐసి,శివ  నాగరాజు, బసవరాజు కరెంటు మల్లికార్జున ఎల్లప్ప హనుమేష్  కృష్ణ వీరేష్  రాజ, దేవరాజు సున్నం వీరేష్ గదిలింగా, యస్వాత్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author