ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి అంబటి రాంబాబుకు లేదు..
1 min read

హోళగుందన్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత అనుచితమైనవని, బాధ్యతారాహిత్యమైన వని తెలుగు యువత మండలాధ్యక్షులు బకాడి వీరేష్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి అంబటి రాంబాబుకు లేదన్నారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండించారు. ప్రజల చేత ఎన్నుకోబడి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై అసభ్య పదజాలంతో దూషించడం ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమన్నారు. రాజకీయాల్లో విమర్శలు పాలన, విధానాలపై ఉండాలే గానీ వ్యక్తిగత దూషణలుగా మారకూడదన్నారు. ఇలాంటి దిగజారిన వ్యాఖ్యలను ప్రజలు ఎప్పటికీ సహించరన్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలందించిన చంద్రబాబునాయుడు ప్రతిష్టను కించపరిచే ప్రయత్నాలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

