NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి

1 min read

హోళగుందన్యూస్ నేడు:  సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్  పేద కుటుంబాలకు వివాహ సహాయం.టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్  నివాసంలో శివస్వామి వారిఆశీర్వచనాలు, హోళగుంద మండలానికి చెందిన శివస్వామి వారు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్  నివాసానికి విచ్చేసి, పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు సహాయం అందించే అంశంపై ఈబీజీ గోవింద్ గౌడ్  మరియు ఈబీజీ రాజేంద్ర గౌడ్ తో కలిసి చర్చించడం జరిగింది.ఈ సందర్భంగా రెండు ఆడపిల్లల వివాహానికి అవసరమైన తాళిబొట్లు అందించాలని శివస్వామి వారు కోరగా, ఈబీజీ గోవింద్ గౌడ్  మరియు రాజేంద్ర గౌడ్  వెంటనే స్పందించి, రెండు ఆడపిల్లలకు తాళిబొట్లు అందజేశారు.ప్రతి సంవత్సరం ఇలాగే పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు తాళిబొట్లు అందించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని ఈబీజీ గోవింద్ గౌడ్  తెలిపారు.ఈ సందర్భంగా శివస్వామి వారు మాట్లాడుతూ,“దేవుడు ఈబీజీ గోవింద్ గౌడ్ మరియు రాజేంద్ర గౌడ్ పై ఎల్లప్పుడూ కరుణ చూపాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో కొనసాగించాలని” ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో శివస్వాములు, టీడీపీ సీనియర్ నాయకులు దిడ్డి నాగప్ప, దిడ్డిమలయ్య, టీడీపీ నాయకుడు రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.

About Author