సుచిర్ ఇండియా ఫౌండేషన్ అవార్డు అందుకున్న పెద్దిరెడ్డి మౌలాలి రెడ్డి
1 min read

హైదరాబాద్, న్యూస్ నేడు: సుచిర్ ఇండియా ఫౌండేషన్ వారు హైదరాబాద్ నగరం నందు నిర్వహించిన అవార్డు ఫెస్టివల్లో నంద్యాల పట్టణం ఎన్జీఓ కాలనీలోని శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల డైరెక్టర్ పెద్దిరెడ్డి మౌలాలి రెడ్డి ఉత్తమ ఛాత్రాలయ పురస్కారం అవార్డును అందుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉత్తమ డైరెక్టర్ గా చాత్రాలయ పురస్కార అవార్డును నంద్యాల జిల్లాలోని శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల డైరెక్టర్ పెద్దిరెడ్డి మౌలాలి రెడ్డి అందుకున్నారు. హైదరాబాద్ లోని లలిత కళా తోరణం పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన సుచిర్ ఇండియా అవార్డు ప్రధానోత్సవంలో ఉత్తమ డైరెక్టర్ గా ఛాత్రాలయ పురస్కారం అవార్డును పెద్దిరెడ్డి మౌలాలి రెడ్డికి ఫౌండేషన్ చైర్మన్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ముఖ్య అతిధులైన ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్, మాజీ మంతి గంటా శ్రీనివాస రావు, శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, ప్రముఖ సినీ నటుడు శివాజీ రాజా చేతుల మీదుగా అందుకున్నారు. అతిథులు మాట్లాడుతూ నూతన విద్యా బోధనకు రోల్ మోడల్ గా నిలిచి బ్యాంకింగ్ రంగంలో విశేష కృషి చేస్తూ విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా శిక్షణ అందిస్తున్నారని కొనియాడారు. తన తండ్రి శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి బాటలో ఆయన కుమారుడు విద్యాసంస్థల డైరెక్టర్ పెద్దిరెడ్డి మౌలాలి రెడ్డి నడుస్తూ నిరుద్యోగులను ఉద్యోగులుగా చేయడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. అత్యుత్తమ విద్య ప్రమాణాలకు మార్గదర్శకులుగా నిలుస్తున్న పెద్దిరెడ్డి మౌలాలి రెడ్డికి సుచర్ ఇండియా ఫౌండేషన్ తరపున ఉత్తమ ఛాత్రాలయ పురస్కారం అందించారు.

