గుడిసె ఆది కృష్ణమ్మ ప్రమాణ స్వీకార మహోత్సవం
1 min read

హోళగుంద న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ప్రమాణ స్వీకార మహోత్సవం, ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హోళగుంద మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గోవిందు గౌడ్ , టిడిపి మాజీ కన్వీనర్ వీరన్న గౌడ్ , సీనియర్ నాయకులు రామాంజిని, దిడ్డి నాగప్ప, హుస్సేన్ పీరా , మండల మైనార్టీ అధ్యక్షుడు ముల్లా మోయిన్ భీమ తదితర నాయకులు హాజరై శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ కి పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ మరింత బలోపేతం కావాలని, ప్రజాసేవలో కొత్త అధ్యాయానికి ఇది ఆరంభం కావాలని నాయకులు ఆకాంక్షించారు.


