NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జీ తెలుగు ఆట కొత్త సీజన్ ఫిబ్రవరి 7న ప్రారంభం

1 min read

ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు.. టీవీ కంటే 48 గంటల ముందుగానే ప్రతి గురు, శుక్రవారాల్లో జీ5లో!

కర్నూలు, న్యూస్​ నేడు :  తెలుగుప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలని అందిస్తూ వినోదం పంచుతున్న జీతెలుగు ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావడంలోనూ ముందుంటుంది. తెలుగు టెలివిజన్చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన డాన్స్ రియాలిటీ షో జీ తెలుగు ‘ఆట’. ఈకార్యక్రమంతో ఎందరో ప్రతిభావంతులైన డాన్సర్లను వెలుగులోకి తీసుకొచ్చిన జీ తెలుగుఆట సరికొత్త సీజన్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బుల్లితెర పాపులర్డాన్స్ షో ‘ఆట’ సరికొత్త సీజన్ ఫిబ్రవరి 7న ప్రారంభం, ప్రతి శని, ఆదివారాల్లోరాత్రి 9గంటలకు, మీజీ తెలుగులో.. ఫిబ్రవరి 5 నుంచి ప్రతి గురు, శుక్రవారాల్లోకొత్త ఎపిసోడ్స్ టీవీ కంటే 48 గంటల ముందే మన జీ5లో!ఎందరోప్రతిభావంతులను వెండితెరకు పరిచయం చేసిన ఆట సరికొత్త సీజన్కి ఎనర్జిటిక్ యాంకర్సుధీర్ వాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆట టైటిల్ కోసం నలుగురు మెంటర్స్ కావ్య, విష్ణుప్రియ, వంశీ, సమీరాభరద్వాజ్ మార్గదర్శకత్వంలో 16మంది ప్రతిభావంతులు పోటీపడనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి రాధికాశరత్కుమార్, కొరియోగ్రాఫర్జానీ మాస్టర్, మెగాడాటర్ నిహారికా కొణిదెల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఆటసరికొత్త సీజన్ ప్రారంభ ఎపిసోడ్లో అద్భుతమైన ప్రదర్శనలతో కంటెస్టెంట్స్పోటీపడనున్నారు. ఇటీవల బ్లాక్బస్టర్ హిట్ సాంగ్స్ ‘సూసేకి అగ్గిపుల్ల’, ‘చుట్టమల్లే’, ‘గిర గిర గిర’వంటి పాటలకు అద్భుతమైన కొరియోగ్రఫీతో కంటెస్టెంట్లు, మెంటర్లు డాన్స్ చేసి అలరించనున్నారు. అంతేకాదు, యాంకర్సుధీర్ ప్రస్థానంపై కంటెస్టెంట్ అక్షత ప్రదర్శన అందరినీ ఆకట్టుకోనుంది.కొరియోగ్రాఫర్గా రాణిస్తున్న రాప్టర్ యువరాజ్ కంటెస్టెంట్గా ఆట టైటిల్ పోరులోదిగనున్నారు. అద్భుతమైన ప్రదర్శనలు,భావోద్వేగ క్షణాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగనున్న ఈ కార్యక్రమం ప్రేక్షకులనుఅలరించేందుకు జీ తెలుగు వేదికగా ప్రసారం కానుంది.

About Author