NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు జిల్లా గ్రంథాలయంలో చదువుకున్న ఇద్దరు విద్యార్థులకు గ్రూప్ 2 కొలువులు

1 min read

ఇరువురిని ఘనంగా సత్కరించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ. నాగరాజు, కార్యదర్శి ఎం.శేఖర్ బాబు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : బుధవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాగ్రంథాలయసంస్థ – ఏలూరుజిల్లాకేంద్ర గ్రంథాలయంలోచదువుకొని ఇటీవలగ్రూపు-2 పరీక్షలువ్రాసి ఉత్తీర్ణులులైన ఇద్దరువిద్యార్థులు సత్యాల అజయ్ కుమార్ హాల్ టికెట్ నెంబర్:111103373 అసిస్టెంట్ రిజిస్టార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్ జోన్ 2 లో ప్రభుత్వఉద్యోగం సాధించారు, మరియు పులపాక. సంపత్ కుమార్ హాల్ టికెట్ నెంబర్:111103772 ఎపి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ప్రధానకార్యాలయం, మంగళగిరియందు జూనియర్అసిస్టెంట్ గా ప్రభుత్వఉద్యోగoసాధించారు. ప్రభుత్వఉద్యోగాలు సాధించినవీరిఇరువురుకీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాగ్రంథాలయసంస్థ చైర్మన్  జుత్తుగ నాగరాజు  శాలువాలతోఘనంగా సన్మానించి మీరూభవిష్యత్ లో ఇంకాఅనేక ఉన్నతస్థాయి కీ ఎదగాలనిమనస్పూర్తిగా కోరుకుంటూఅభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  జిల్లాగ్రంథాలయసంస్థ కార్యదర్శి ఎమ్. శేఖర్ బాబు, డిప్యూటీ లైబ్రేరియన్ ఎ. నారాయణరావు, ఇతరకార్యాలయ అధికారులు,కార్యాలయం సిబ్బంది,జిల్లా కేంద్ర గ్రంథాలయంసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author