మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపిస్తే సహించం
1 min read

ప్యాపిలి మండల బిజెపి అధ్యక్షులు కె,బి. దామోదర్ నాయుడు
ప్యాపిలి న్యూస్ నేడు : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం చండ్రపల్లె ప్రాథమిక పాఠశాల,హుసేనాపురం హైస్కూల్ లలో ప్యాపిలి మండల బిజెపి అధ్యక్షులు కెబి. దామోదర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేయడం జరిగిందని మధ్యాహ్న భోజనం నిర్వాహకులు బాధ్యతతో నాణ్యమైన భోజనాన్ని అందించడాన్ని అభినందిస్తున్నానన్నారు. ఇకపై మండలం లో వారంలో రెండు రోజులు ఏదో ఒక పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేస్తామని నాణ్యత లోపిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు.

