NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థినీ లు పరీక్షల లో 100 శాతం ఉత్తిర్నత సాధించాలి

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: విద్యార్థిని లు పరీక్షల లో 100 శాతం ఉత్తిర్నిత సాధించాలంటే  అధ్యాపకులు క్లాస్ లో చెప్పినవి నోట్ చేసుకొని టెస్ట్ బుక్స్ బాగా కష్ట పడి క్రమశిక్షణ తో చదవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రామిరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ నాగార్జున అన్నారు. ప్యాపిలి పట్టణం లోని కస్తూరిభా గాంధీ బాలికల గురుకుల పాఠశాల సందర్శించి మాట్లాడుతూ   ఇష్టముతో కష్టపడి చదివితే చదువు ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది విద్యార్థినులకు వారు తెలిపారు.అనంతరం డీ పి ఎం ఓ రామచంద్ర రెడ్డి స్పర్శ కుష్ఠు అవర్నెస్ కార్యక్రమం పైన అవగాహనా కల్పిస్తూ శరీరం పైన స్పర్శ లేని మచ్చలు, పొడలు, కను రెప్పలు పై వెంటుకలు రాలుంటే, జోములు ఉంటే  ఆశ కానీ వైద్య సిబ్బంది కలసి పరీక్ష చేయించు కొని నిర్ధారణ అయితే ఎం డీ టీ మందులు వాడితే పూర్తి గా నయం అవుతుంది. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాఘవేంద్ర గౌడు బాల్యవివాహాలు ఆపలంటే చదువు కొనసాగాలని, సరియైన వివాహ వయసు అమ్మాయికి 18,అబ్బాయి కి 21 సంవత్సరాల వయసు పూర్తి అయితనే వివాహం చేసుకోవాలి అని,కాన్సర్, క్షయ, సీజినల్ వ్యాదుల పైన, ఋతుక్రమం పరిశుభ్రత, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పైన అవగాహనా కల్పించడం జరిగింది.కార్యక్రమం లో ఏ ఎస్ ఐ మురళీ కృష్ణ,  ప్రిన్సిపాల్ ప్రియాంక, జయలక్ష్మి, అధ్యాపకులు, ఆశ కార్యకర్త రమాదేవి పాల్గొన్నారు.

About Author