కేంద్ర ప్రభుత్వ సహకారంతో బిఎస్ఎన్ఎల్ అభివృద్ధి బాట
1 min read

ప్రజలందరూ బిఎస్ఎన్ఎల్ సేవలను ఉపయోగించుకోవాలి
కర్నూలు పర్యటన సందర్భంగా ఏపీ టెలికాం చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం.శేషాచలం .
కర్నూలు, న్యూస్ నేడు: కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వదేశీ టెక్నాలజీతో బిఎస్ఎన్ఎల్ 4జి సేవలను అభివృద్ధి చేసి రోజు రోజు కు అభివృద్ధి సాధిస్తున్నదని ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం .శేషాచలం చెప్పారు. కర్నూలు బిజినెస్ ఏరియా సాధిస్తున్న ఫలితాలను రివ్యూ చేయడానికి వచ్చిన ఆయన శనివారం నాడు స్థానిక బిఎస్ఎన్ఎల్ భవన్ కార్యాలయం నందు ఉద్యోగస్తులు, వ్యాపార భాగస్వాముల సమావేశంలో మాట్లాడుతూ , కర్నూల్ బిజినెస్ ఏరియాలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధికి తగిన టెలికాం సౌకర్యాలను బిఎస్ఎన్ఎల్ అందిస్తున్నదని, పారిశ్రామికవేత్తలు బిఎస్ఎన్ఎల్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఫైబర్ ఇంటర్నెట్ సర్వీసులలో బిఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాను ” బిఎస్ఎన్ఎల్ స్పార్క్” ప్రవేశపెట్టింది. కేవలం నెలకు 399/- రూపాయలకే 50 ఎం బి పి ఎస్ స్పీడుతో 3300 జీబీ అ పరిమితమైన డేటాను, అపరిమితమైన కాల్స్ సౌకర్యాలను సంవత్సరం పాటు అందిస్తున్నదని , సంవత్సరం తరువాత నెలకు 449/- ప్లాను గా మారుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బిఎస్ఎన్ఎల్ కర్నూల్ బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జి రమేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డీజీఎం శ్రీ కె రాజేశ్వర రావు, ఐ ఎఫ్ ఏ శ్రీమతి డి శ్రీలత, కర్నూలు జిల్లా బిఎస్ఎన్ఎల్ అధికారులు, భాగస్వాములు పాల్గొన్నారు.


