“బీసీ సింహ గర్జన” పోస్టర్ల ఆవిష్కరణ
1 min read

హోళగుందన్యూస్ నేడు: కర్నూలు జిల్లా బిసివై పార్టీ కన్వినర్ ఎల్లార్తి వాల్మీకి అర్జున్ ఆధ్వర్యంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు మరియు విధ్యార్థి సంఘం నాయకుల చేతులమీదుగా ఆదోని నియోజకవర్గం స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు “బీసీ సింహ గర్జన”కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించి భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో 22 న జరిగే భారీ బహిరంగ సభకు తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది.బీసీ రక్షణ చట్టం అమలు._రాజధాని ప్రాంతంలో బీసీలకు వెయ్యి ఎకరాల భూమి కేటాయింపు.బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు._సమగ్ర కులగణన.విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44 రిజర్వేషన్లు._పై తెలిపిన అంశాలపై బిసి సంఘం నాయకులు మాట్లాడుతూ ఖచ్చితంగా మేమంతా బిసీల హక్కుల కోసం ఎంతవరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా వున్నామని “మేమెంతో మనకు అంత వాటా” రావాలని డిమాండ్ చేస్తూ బిసి సింహ గర్జన భారీ బహిరంగ సభ విజయవంతం కావాలని కోరడమైనది.ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు,ఇండియా సంయుక్త రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ దళిత బహుజన శ్రామిక విముక్తి నాయకులు పగిడాల కోదండ, బిసి ఫెడరేషన్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కత్తి హనుమంతరావు, డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రిటైర్డ్ ఎమ్మార్వో షేక్ శెక్షావలి,గౌరవాధ్యక్షులు ఎం.వీరభద్రప్ప,నల్లారెడ్డి,మరియు విధ్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు పిడిఎస్ఓ తిరుమలేష్,ఢణాపురం ఉదయ్ కుమార్ డిఎస్ఫి రాష్ట్ర అధ్యక్షులు,డిఎస్ఫి రాష్ట్ర కార్యదర్శి బాలు,వాల్మీకి జేఏసి నాయకులు రంగస్వామి, బసాపురం శేకన్న,బిసివై పార్టీ నాయకులు నరేంద్ర యాదవ్ పాల్గొనడం జరిగింది.

