దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చర్యలు
1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
స్వచ్ఛతలో నగరాన్ని టాప్‌లో ఉంచుదాం
గుత్తేదారుల బిల్లుల నమోదు వేగవంతం
డ్రైనేజీ కాలువల్లో పైప్‌లైన్ల తొలగింపు
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం నగరపాలక సంస్థ పరిపాలనలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. సోమవారం వెంకటరమణ కాలనీలోని నగరపాలక కార్యాలయంలో ఇంజినీరింగ్, ప్రజారోగ్య, అకౌంట్స్ విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ అంశాలపై సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న గుత్తేదారుల బిల్లుల నమోదు ప్రక్రియను వేగవంతం చేసి, సకాలంలో మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన ప్రత్యేకంగా తాత్కాలిక సిబ్బందిని నియమించుకోవాలని తెలిపారు.స్వచ్ఛతలో నగరాన్ని అగ్రస్థానంలో నిలపడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎస్‌ఈ విష్ణుమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్, కార్యదర్శి నాగరాజు, ఎంఈలు మనోహర్ రెడ్డి, గిరిరాజ్, డిఈఈలు కృష్ణలత, నరేష్, సూపరింటెండెంట్ మంజూర్ బాష తదితరులు పాల్గొన్నారు.

