మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను కలిసిన ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ విశ్వనాధ్ ని ఇటీవల నూతనంగా ఎన్నికైన ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు వి జవహర్లాల్ మరియు జిల్లా కార్యదర్శి ఎం సి కాశన్న ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది మరియు శాలువతో పూల బోకేతో సన్మానించడం జరిగినది.ఈ సందర్భంగా మన కర్నూలు జిల్లా కమిషనర్ కి కొన్ని సమస్యల గురించి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగినది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి దీనిపై విచారణ చేసి వెంటనే తగు చర్యలు తీసుకుంటాము అని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి,జిల్లా సంయుక్త కార్యదర్శి నాగ కిషోర్,కర్నూల్ నగర అసోసియేట్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు సాయిరాం, ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల జిల్లా సంఘం అధ్యక్షులు మద్దిలేటి మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

