వెల్ బేబీ షోలో 15 నెలల సయ్యద్ జైన్ అష్రఫ్ కు ఫస్ట్ ప్రైజ్
1 min read
హైదరాబాద్, న్యూస్ నేడు: సాయంత్రం నాంపల్లి లోని 85వ అల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ 2026 లో , యశోద హాస్పిటల్ మరియు ఎగ్జిబిషన్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన వెల్ బేబీ షోలో 15 నెలల సయ్యద్ జైన్ అష్రఫ్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాడు. గత సంవత్సరం 100 రోజుల పిల్లలకు ఇక్కడే నిర్వహించిన వెల్ బేబీ షో లో కూడా జైన్ అష్రఫ్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న విషయం పాఠకులకు తెలిసిందే. ఇతని తల్లి తండ్రులు డా. షహీరా మరియు డా. జావేద్ అష్రఫ్ కర్నూలుకు చెందినవారు. ఈ విజేత అనంతపురం మరియు కర్నూల్ జిల్లాలలో జాయింట్ కలెక్టర్ గా పనిచేసి రిటైర్ అయిన సయ్యద్ ఖాజా మొహియుద్దీన్ మనవడు.

