NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి

1 min read

మిడుతూరులో కార్మికుల ధర్నా విజయవంతం..

మిడుతూరు, న్యూస్​ నేడు:  నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో మిడుతూరు,గడివేముల సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం,   కార్మిక,కర్షకులు కలిసి గురువారం మిడుతూరులో చేపట్టిన ధర్నా విజయవంతం అయింది.ర్యాలీ అనంతరం బస్టాండ్ సెంటర్ లో అంగన్వాడి వర్కర్స్ మరియు ఆశా కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి ధర్నా చేపట్టారు.తర్వాత తహసిల్దార్ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు.   వ్యకా సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ నాయక్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు జి నాగమణిమాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను 29 లేబర్ చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా చేసి కార్మికులను ఉరితాడుగా మార్చారు.2025 విబి,జి రాం జీ బిల్లు తెచ్చి గ్రామీణ పేదలను మరింత పేదలుగా చేసే విధంగా చేశారు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు.రైతులకు నష్టం కలిగించేచట్టాన్ని రద్దు చేయాలి. పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలి స్కీం వర్కర్లకు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి అంగనవాడీ,ఆశా,మధ్యాహ్న భోజన కార్మికులు,సమగ్ర శిక్ష, నేషనల్ హెల్త్,తదితర స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.సిపిఎస్ రద్దు పాత పింఛన్ అమలు చేయాలి, కాంటాక్ట్,ఔట్సోర్సింగ్,టైం స్కేల్ తదితర ఉద్యోగులు రెగ్యులరేషన్ చేయాలని అన్నారు.ఇవి అమలు చేయని యెడల రాబోయే రోజుల్లో సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చెన్నమ్మ,వ్యకాస జిల్లా నాయకులు ఓబులేష్, కెవిపిఎస్,లింగస్వామి,ఎం ఆర్పిఎస్ సతీష్,అంగన్వాడి లక్ష్మీకుమారి,ప్రమీల,ఆటో యూనియన్ జిల్లా నాయకులు బాలు,శ్యామల పాల్గొన్నారు.

About Author