NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పగిడ్యాల బ్రాందీ షాప్ కు దరఖాస్తుల ఆహ్వానం

1 min read

ప్రొహిబిషన్  అండ్​ ఎక్సైజ్ ఎస్ఐ జఫురుల్లా

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలో ఒక బ్రాందీ వైన్ షాపుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఎస్ఐ జఫురుల్లా అన్నారు.ఈ సందర్భంగా గురువారం ఎస్సై మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు  గీత కులాల  బ్రాందీషాప్ కు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని గీత కులాల బ్రాంది షాప్  కొరకు దరఖాస్తులు చేసుకోవాలని కోరుకుంటూ ఇది గౌడ కులస్థులకు రీజర్వు చేసి ఉన్నారు.గౌడ కులస్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలనిఈనెల 21 సా 5 గం.ల లోపు తమ అర్జీలను నందికొట్కూరు ప్రొహిబిషన్ కార్యాలయంలో గానీ లేదా నంద్యాల ప్రొహిబిషన్ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వవచ్చని ఎస్ఐ అన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.ఈనెల 23వ తేదీ ఉ 8 గంటలకు నంద్యాల కలెక్టర్ కార్యాలయం వీసీ కాన్ఫరెన్స్ సమావేశ హాల్లో జిల్లా అధికారులు లాటరీ ద్వారా బ్రాందీ షాపును ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు.

About Author