దామోదరం సంజీవయ్య సేవలు ఎనలేనివి
1 min read

పబ్బతి శివప్రసాద్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: మాజీ ముఖ్యమంత్రి కీ.శే దామోదరం సంజీవయ్య రాష్ట్రానికి చేసిన సేవలు ఎనలేనివని నందికొట్కూరు మాల మహానాడు నాయకులు పబ్బతి శివ ప్రసాద్ అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం మాల మహానాడు కార్యాలయంలో దామోదరం సంజీవయ్య 105 వ జయంతి వేడుకలను శివప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు.ఆయన చిత్రపటానికి మాల మహానాడు నాయకులు పూలమాలలతో నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలోనే మొట్ట మొదటి తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అని ఆయన సేవలను వారు కొనియాడారు.కర్నూలు జిల్లా పెదపాడు గ్రామంలో సుంకులమ్మ మునయ్య దంపతులకు జన్మించిన ఆయన 38 ఏళ్ల అతి చిన్నవయసులో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారని కేంద్ర మంత్రిగా రెండుసార్లు ఏఐసిసి అధ్యక్షులుగా ఆయన సేవలు చిరస్మరణీయం,ఏసీబీ వ్యవస్థ స్థాపన భూ పంపిణీ పెన్షన్ వంటి విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి అందరికీ పదవులు అనుభవించినా ఆయనకు మాత్రం సొంత ఇల్లు కూడా లేని వారన్నారు. నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఉపాధ్యక్షులు నల్లమల్ల పుల్లన్న,నాగేంద్ర, భూషణం,పాలమర్రి నాగరాజు,శ్రీనివాసులు పాత్రికేయులు ఉశేనాళం, జంబులయ్య,శ్రీనివాసులు, రహమ్ తుల్లా,కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

