పుల్వామా అమర వీరులకు కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి
1 min read

న్యూస్ నేడు, పత్తికొండ: 2019 ఫిబ్రవరి 14న పుల్వామా వద్ద ఉగ్రవాద పిరికిపందలు జరిపిన దాడిలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన సీఆర్పీఎఫ్ అమర వీరులకు స్థానిక నా ములుగు స్తంభాల కూడలి వద్ద శనివారం సీఐ పులి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రవృత్తులతో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా అమర వీరుల చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి, క్రోవత్తులు వెలిగించి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో పత్తికొండ సీఐ పులి శేఖర్ గౌడ్ మాట్లాడుతూ, పుల్వామా అమరుల త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్లను ప్రతి భారతీయుడు ఎప్పటికీ మరచిపోరని తెలిపారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు దేశ ప్రజలు ఐక్యంగా నిలవాలని, యువతలో దేశభక్తి భావన పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.అలాగే బిజెపి నాయకులు గోవర్ధన్ నాయుడు, కరణం నరేష్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరుల త్యాగం వృథా కాదని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ దేశ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. యువత దేశభక్తి మార్గంలో నడిచి దేశ అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమర వీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మయ్య రామలింగన్న రాంపల్లి రంగయ్య మాలేఖరి వీరేష్ నరసింహులు రమణ రాజా జై చంద్ర సీసీ రంగన్న అడ్వకేట్ భాస్కర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

