NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ్రోన్స్..సీసీ కెమెరాల నీడలో కాల్వబుగ్గ

1 min read

బ్రహ్మోత్సవాలకు 200 మంది పోలీస్ సిబ్బంది..

 ఓర్వకల్లు , న్యూస్​ నేడు : 17వ తేదీనకాల్వబుగ్గ శ్రీ బుగ్గరామేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు 200 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారని వీరిలో నలుగురు సీఐలు,ఎస్సైలు ఎనిమిది మంది మరియు సిబ్బంది వస్తున్నారనిఓర్వకల్లు ఎస్సై యు.సునీల్ కుమార్ అన్నారు.కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని కాల్వబుగ్గ శ్రీ బుగ్గ రామేశ్వర దేవాలయం డ్రోన్స్ మరియు సీసీ కెమెరాల నీడలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.ఈ సందర్భంగా శనివారం పాత్రికేయులతో ఎస్సై మాట్లాడుతూఈ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు మరియు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటివి ఇక్కడ జరిగే ప్రతి వాటిని కూడా రికార్డు చేస్తున్నాం. అంతే కాకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పలుపడితే కఠిన శిక్షలు పడేలా విధిస్తామని ఎస్ఐ అన్నారు. భక్తులకు తగిన రీతిలో ఏర్పాట్లు చేశామని గతంలో సాంస్కృతిక స్టేజి దగ్గర సమస్యలు తలెత్తాయని వాటి ని దృష్టిలో పెట్టుకొని గతం కంటే ఎక్కువగా పోలీస్ సిబ్బందిని ఎస్పీ నియమించారని అంతేకాకుండా భక్తులు వచ్చి పూజలు నిర్వహించుకోవాలని ఈ ప్రాంతంలో తోపులాట లేకుండా మహిళలకు పురుషులకు రానూ పోయే విధంగా ప్రత్యేకంగా బ్యారీకేడ్లు ఏర్పాటు చేసినట్లు  ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపారు.

About Author