NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆల్బెండజోల్  మాత్రలు వాడి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి

1 min read

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి.

కర్నూలు, న్యూస్​ నేడు : జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు  కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు. పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.మంగళవారం నగరంలోని ఇందిరాగాంధీ స్మారక ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్  మాత్రలు అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…జిల్లాలో మొత్తం 4,400 ప్రభుత్వ,  ప్రైవేట్ విద్యాసంస్థలు ఉండగా, సుమారు 6 లక్షల 57 వేల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వీరందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందజేసి నులిపురుగుల నివారణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు..ఈ యాక్షన్ ప్లాన్‌ను సద్వినియోగం చేసుకొని బలహీనంగా ఉన్న సబ్జెక్టు లో పట్టు సాధించాలని విద్యార్థులకు సూచించారు.  పదవ తరగతి వరకే చదువు ఆపకుండా, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ వరకు విద్యను కొనసాగించాలని ప్రోత్సహించారు.

About Author