నంద్యాలలో సి అండ్ డి ప్లాంట్ నిర్మాణం వేగవంతం చేయాలి
1 min read

జూన్ 5లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం
నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల పట్టణంలో నిర్మాణ & ధ్వంస వ్యర్థాల (C&D Waste) నిర్మాణ పనులను 2026 జూన్ 5వ తేదీ నాటికి తప్పనిసరిగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో నిర్మాణ & ధ్వంస వ్యర్థాల సమర్థ నిర్వహణ కోసం ప్రతిపాదించిన సి & డి ప్లాంట్ స్థాపన, ప్రారంభం మరియు ప్లాంటేషన్ కార్యక్రమాల పురోగతిపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పర్యావరణ ఇంజనీర్ పి.వి. కిషోర్ రెడ్డి, నంద్యాల ఆర్డీఓ సి. విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న, ప్లాంట్‌కు సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ను సిద్ధం చేయాలని APIIC జోనల్ మేనేజర్ ను కలెక్టర్ ఆదేశించారు. ప్రాజెక్ట్‌లో అవసరమైన సాంకేతిక అంశాలు, వ్యయ అంచనాలు, పర్యావరణ అనుమతులు తదితర అంశాలు స్పష్టంగా ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

