సర్వే పురోగతి పనులపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష
1 min read

ఏలూరు జిల్లా ప్రతినిధి, న్యూస్ నేడు : ఏలూరు జిల్లా పరిధిలోని కొల్లేరు అభయారణ్య పరిధి సరిహద్దులను రెవిన్యూ,సర్వే, అటవీ శాఖల సిబ్బంది ఉమ్మడి తనిఖీ సర్వే చేసి పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో గురువారం కొల్లేరు అభయారణ్య పరిధి సరిహద్దుల సర్వే పనుల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో కొల్లేరు ప్రాంతంలోని 55 గ్రామాలలో జి.ఓ 120 ప్రకారం కొల్లేరు అభయారణ్య పరిధిలో సరిహద్దులను రెవిన్యూ, సర్వే, అటవీ శాఖల సిబ్బంది ఉమ్మడి తనిఖీ సర్వే త్వరితగతిన పూర్తిచేయాలని, సర్వే చేసిన అనంతరం ఆయా గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకో వాలన్నారు. ఇప్పటికే దాదాపు 52 గ్రామాలలో సరిహద్దులను గుర్తించడం జరిగిందని, మిగిలిన గ్రామాలలో కూడా సర్వే పనులు పూర్తిచేయాలన్నారు. జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ రెడ్డి, డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, సర్వే శాఖ ఏడి అన్సారీ, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.


