NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుదాం

1 min read

సామాజిక న్యాయం అమలు జరిగేంత వరకు పోరాడుదాం

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్

సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆర్.ఆర్.పేట, స్ఫూర్తి భవన్ నందు ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఉప్పులూరి హేమ శంకర్ అధ్యక్షతన సభ నిర్వహించారు.ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డేగా ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ఆర్థిక,సామాజిక, అసమానతలు,కుల,మత వివక్షతలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను తగ్గించడానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కమ్యూనిస్టు పార్టీలు యూపీఏ వన్ ప్రభుత్వంలో కొట్లాడి సాధించారని గుర్తు చేశారు మోడీ అమిత్ షా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ వి బి జి రామ్ జి పేరుతో పేదవాడి పొట్టలు కొట్టారని ఆరోపించారు. ఆ విధానాలను కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రయత్నించడం దురదృష్టకరమని అన్నారు. దేశంలో 40,50 మంది మాత్రమే ఉన్న కార్పొరేట్ కంపెనీల వారికి లక్షల కోట్ల రూపాయలను రాయితీలుగా ఇస్తూ పేదవాడి జీవనోపాధిని సైతం దెబ్బతీయడం, సామాన్యుల ఆర్థిక పరిస్థితి మెరుగు పడటానికి అవసరమయ్యే పథకాలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. రైతులు, కౌలు రైతులకు అవసరమయ్యే ఎరువులు పురుగుమందులను సరఫరా చేయడంలో పేదవాడికి నిత్యావసర వస్తువుల ధరలను అందుబాటులో ఉంచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆరోపించారు. కొద్ది శాతం ఉన్న కార్పొరేట్ కంపెనీలకు విధించే పనులు 35 శాతం నుండి 22 శాతానికి తగ్గించడంలో ఉన్న ఆసక్తి పేదవాడి ఆర్థిక పరిస్థితి మెరుగు పడటానికి మెరుగుపరచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా  కార్యవర్గ సభ్యులు కొల్లూరి సుధారాణి, గొర్లి స్వాతి, శాయన అభిలాష్ కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు భజంత్రీ శ్రీనివాసరావు,బుగ్గల ప్రభాకర్,ఏం. ఏ.హకీమ్,బళ్ల కనకదుర్గారావు, ఉప్పులూరి లక్ష్మి, భవాని, జ్యోతి, జోజి మేరీ, రాజామణి,బేతా శంకర్,యర్రా వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

About Author