మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత …
1 min read

కర్నూలు ఎస్పీ ఆదేశాలతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు…
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు జిల్లాలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడం, అవగాహన పెంపొందించడం మరియు అత్యవసర సమయంలో తక్షణ సహాయం అందించేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు మరియు గ్రామాలలో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. మహిళల పై నేరాలు , సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై చైతన్యం కల్పించారు. శక్తి యాప్ , అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన డయల్ 112 , డయల్ 100 , 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ , పోలీసు సేవల గురించి వివరించారు. మహిళలు , బాలికలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదు చేయడంలో వెనుకాడవద్దని సూచించారు.ఫిర్యాదులపై తక్షణ మే చర్యలు తీసుకుంటామని, మహిళల భద్రతే మా ప్రధాన లక్ష్యం అని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు.

