NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిర్మాణాలు పూర్తి చెయ్యని సిమెంట్ ఫ్యాక్టరీల‌పై చ‌ర్యలు తీసుకుంటాం..

1 min read

రాష్ట్ర‌ ప‌రిశ్రమ‌ల‌శాఖ‌ మంత్రి టీజీ భ‌ర‌త్

శాస‌న‌స‌భ‌లో మాట్లాడిన మంత్రి టీజీ భ‌ర‌త్

కర్నూలు, న్యూస్​ నేడు:  గ‌డువు పూర్తయినా ఇంకా నిర్మాణాలు పూర్తి చేయ‌ని రాష్ట్రంలోని సిమెంట్ ఫ్యాక్టరీల‌పై త‌గిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. శాస‌న‌స‌భ‌లో ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస రావు అడిగిన ప్ర‌శ్నకు ఆయ‌న స‌మాధానమిచ్చారు. ఏ కంపెనీకి అయినా డీపీఆర్‌కు అనుగుణంగానే ప్ర‌భుత్వం భూములు కేటాయించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. గ‌డువులోపు త‌ప్పకుండా ప‌నులు పూర్తవ్వాల‌న్నారు. భూములు తీసుకొని ఏళ్లు గ‌డిచినా ఇంకా నిర్మాణాలు పూర్తి చేయ‌క‌పోతే త‌గిన చ‌ర్యలు తీసుకుంటామ‌న్నారు. కూట‌మి ప్రభుత్వం ఏర్పడిన త‌ర్వాత ఇలాంటి అంశాల‌పై స‌మీక్షించిన‌ట్లు చెప్పారు. నిబంధ‌న‌లు అతిక్రమించిన కంపెనీల‌కు నోటీసులు కూడా పంపిన‌ట్లు తెలిపారు. గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో సిమెంట్ కంపెనీల‌పై రివ్యూ చేసి త‌గిన విధంగా ముందుకెళ్తామన్నారు.

About Author