గౌరిగోపాల్ హాస్పిటల్‌లో గ్లాకోమా శస్త్ర చికిత్స
1 min read

మినిమల్లీ ఇన్వెసివ్ గ్లాకోమా(ఎం.ఐ.జిఎస్) పద్దతి ద్వారా విజయవంతంగా ఆపరేషన్
కర్నూలు, న్యూస్ నేడు: గ్లాకోమా వ్యాధికి మినిమల్లీ ఇన్వెసివ్ గ్లాకోమా(ఎం.ఐ.జిఎస్) పద్దతి ద్వారా శస్త్ర చికిత్స విజయవంతంగా చేసినట్లు గౌరిగోపాల్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ మణికంఠ తెలిపారు. కర్నూలు నగరంలోని గౌరిగోపాల్ హాస్పిటల్‌లో వైద్యులు మాట్లాడారు. ఫిబ్రవరి 5వ తేదీన కర్నూలుకు నగరానికి చెందిన బసవేశ్వర్ అనే వ్యక్తికి ఈ సర్జరీ చేసినట్లు చెప్పారు. ఇదివరకు ఈ చికిత్స చేయించుకోవాలంటే హైదరాబాద్, చెన్నై నగరాలకు వెళ్లవలసి వచ్చేదన్నారు. రాయలసీమలో మొదటిసారిగా కర్నూలులో ఇప్పుడు వియవంతంగా శస్త్ర చికిత్స చేసినట్లు తెలిపారు. ఆపరేషన్ తర్వాత రోగి ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో డాక్టర్లు శివశంకర్ రెడ్డి, మణికంఠ, తదితరులు పాల్గొన్నారు.

