NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రముఖ శాస్త్రవేత్త ఆచార్య జి. భగవన్నారాయణను సత్కరించిన  వి.సి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: రాయలసీమ మరియు క్లస్టర్ యూనివర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో క్వాంటం టెక్నాలజీపై రాయలసీమ యూనివర్సిటీ సెనేట్ హాలులో నిర్వహిస్తున్న 6రోజుల అధ్యాపకుల శిక్షణా కార్యక్రమం  ఐదవరోజైన నేడుకూడా కొనసాగింది. నేటి ఉదయం సెషన్లో కర్నూలు  ట్రిపుల్ఐటిడీఎం  సైన్స్ విభాగాల అధ్యక్షులు డాక్టర్ టి. పాండియరాజన్ క్వాంటం కమ్యూనికేషన్స్, క్వాంటమ్ ఎరేజర్స్ మరియు QAD గురించి గురించి అధ్యాపకులకు అవగాహన కలిగించారు. తదుపరి జగన్నాథగట్టులోని ట్రిపుల్ఐటిడీఎం క్యాంపసులోని ల్యాబుకు తొలిబ్యాచ్ అధ్యాపకులను తీసుకువెళ్లి క్వాంటమ్ ఎరేజర్స్ గురించి ప్రాక్టికల్ శిక్షణ అందజేశారు. మధ్యాహ్నం మొదటి సెషన్లో భాగంగా ట్రిపుల్ఐటిడీఎం కు చెందిన డాక్టర్ పి.వి. ప్రకాష్ మద్దూరి క్వాంటం మెటీరియల్స్ గురించి వివరించి ఈ రంగంలోని ప్రస్తుత స్థితిగతులను, భవిష్యత్తులో రానున్న అవకాశాలను తెలియజేశారు. రెండవ సెషన్లో నూజివీడు RGUIT అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గంపల దుర్గాబాబు క్వాంటమ్ ఆప్టిక్స్ తో పాటు క్వాంటమ్ కంప్యూటర్స్ విత్ ఫోటానిక్ క్యుబిట్స్ అనే విషయాన్ని తెలియజేశారు.  గత ఐదురోజులుగా కొనసాగుతున్న ఈ ఎఫ్​డిపి కార్యక్రమం రేపటితో ముగియనుంది. రేపు మధ్యాహ్నం జరిగే ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న క్విన్‌ఫోసిస్ సంస్థ వ్వస్థాపక సీఈఓ  మరియు ప్రధాన శాస్త్రవేత్త ఆచార్య మహేశ్వరరావు వల్లూరి క్వాంటం టెక్నాలజీలోని ఉపాధి అవకాశాలను గురించి వివరిస్తారు.

About Author