NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వచ్ఛమైన త్రాగునీరే లక్ష్యం : డిఈ ఇక్బాల్

1 min read

మిడుతూరు, న్యూస్​ నేడు: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని నందికొట్కూరు ఆర్డబ్ల్యూఎస్ డిఈ ఎస్ మహమ్మద్ ఇక్బాల్  అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని బైరాపురం మరియు మాసపేట పంచాయతీల్లో గతంలో కేంద్ర ప్రభుత్వం నుండి గ్రామాల్లో చేపట్టిన జలజీవన్ మిషన్ పథకం ద్వారా నూతన పైపుల ద్వారా  ఇంటింటికీ కుళాయి వేయించడంతో వాటిని నెయ్యి మరియు మిడుతూరు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విశ్వనాధ్ శనివారం పరిశీలించారు. బైరాపురం గ్రామంలో 9 లక్షల 60 వేల కేంద్ర నిధులతో చేసిన పనులను పరిశీలించి గ్రామ ప్రజలతో మాట్లాడారు.ఈ సందర్భంగా గ్రామాల్లో ఏమైనా నీటి సమస్య వస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలతో అన్నారు.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జల్ అర్పన్- దివాస్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ పనులను పరిశీలించినట్లు డిఈ తెలిపారు.అదేవిధంగా ఎండాకాలం సమీపిస్తున్నందున గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్య రాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిఈ ఎస్ఎండి ఇక్బాల్ ఏఈ విశ్వనాధ్ కు  సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుబ్బారెడ్డి,పంచాయతీ కార్యదర్శులు శ్రీధర్,కేశావతి, గ్రామ నాయకులు చాకర్ వలి, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు స్నేహలత,పవిత్ర తదితరులు పాల్గొన్నారు.

About Author