ఆవిష్కరణ స్ఫూర్తితో విద్యార్థులు: ఈ ఎస్ డి పి వర్క్ షాప్ ముగింపు”
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మరియు జి పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 17 నుండి 21 వరకు నిర్వహించిన వర్క్ షాప్ ముగింపు వేడుక ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ – సిఇఒ డాక్టర్ ఆర్. హఫీజ్ బాషా విద్యార్థుల ప్రాజెక్ట్‌లను అంచనా వేసి, వారి ప్రతిభను ప్రశంసించారు. “విద్యార్థులు చూపిన సృజనాత్మకత మరియు ఆవిష్కరణ స్ఫూర్తి అభినందనీయం. ఇలాంటి వర్క్షాపులు విద్యార్థులకు ఉద్యోగం కోసం వెతకడం కాకుండా, ఉద్యోగాలు సృష్టించే దిశలో అడుగులు వేయడానికి సహాయపడతాయి” అని తెలిపారు.విద్యార్థులు సమర్పించిన ఆవిష్కరణ ఆలోచనలలో కొన్ని:- స్థానిక వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించే మొబైల్ యాప్- పర్యావరణ అనుకూలమైన ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బియ్యపు పొట్టుతో తయారైన ఉత్పత్తులు- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే స్మార్ట్ హెల్త్ కేర్ డివైజ్‌లుఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం గిరిధర్ కుమార్, మరియు డాక్టర్ హెచ్ ఎస్ అఫ్జల్ భాష పాల్గొన్నారు. విద్యార్థుల కృషికి అందరూ ప్రశంసలు తెలిపారు.

