క్వాంటం టెక్నాలజీపట్ల అధ్యాపకులు అవగాహన కలిగిఉండాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కేంద్రప్రభుత్వంతోపాటు, రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి ముందుకు తీసుకుపోతున్న క్వాంటం టెక్నాలజీపట్ల అధ్యాపకులు అవగాహన కలిగిఉండాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు అభిప్రాయపడ్డారు. నగరంలోని రాయలసీమ యూనివర్సిటీ మరియు క్లస్టర్ యూనివర్సిటీల సంయుక్త భాగస్వామ్యంలో క్వాంటం టెక్నాలజీలో అధ్యాపకులకు 16.02.2026 నుండి కొనసాగుతున్న అధ్యాపకుల శిక్షణాకార్యక్రమం (FDP) ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గడచిన వారంరోజులుగా క్వాంటంటెక్నాలజీగురించి, అందులోని వివిధ సంక్లిష్టాంశాలను గురించి తెలియజేయడానికి వివిధ ప్రాంతాలనుండి విచ్చేసిన విషయనిపుణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన అమరావతీ క్వాంటంవ్యాలీ డైరెక్టర్ సి.వి. శ్రీధర్‌కు, కార్యక్రమ రూపకల్పన దగ్గరనుండి సూచనలు సలహాలు అందించిన CSIR – NPL కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఆచార్య జి. భగవన్నారాయణకు, ముగింపు సమావేశానికి విచ్చేసిన ఆచార్య మహేశ్వరరావు వల్లూరిలకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ యూనివర్సిటీ డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య సి. వి. కృష్ణారెడ్డి, IQAC డైరెక్టర్ ఆచార్య ఆర్. భరత్ కుమార్, క్లస్టర్ యూనివర్సిటీ నుండి డాక్టర్ అక్తర్ బాను, డాక్టర్ వాయిజ్ తోపాటు వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.

