పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత పై శ్రద్ధ వహించాలి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: పిల్లల వ్యక్తిగత పరిశుభ్రత పై శ్రద్ధ వహించాలి-లీగల్ సర్వీస్ యూనిట్ మెంబెర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీ బి.లీలా వెంకట శేషాద్రి ఆదేశాల మేరకు నేడు వెంకటరమణ కాలనీ కీర్తన అనాద శరణాలయాన్ని లీగల్ సర్వీస్ యూనిట్ ఫర్ చిల్డ్రన్ సభ్యులు పరిశీలించారు ఈ సందర్భంగా ఎల్. ఎస్. యు మెంబర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ గృహంలో నివసిస్తున్న పిల్లల సంక్షేమం, పరిశుభ్రత,ఆహార నాణ్యత,రికార్డులు మెయింటనెన్స్, తదితర మార్గదర్శకాలు తనిఖీ చేసి తగిన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్. ఎస్ యు కమిటీ సభ్యులు మరియు ప్రముఖ కంటి వైద్య నిపుణుల డాక్టర్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

