NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెద‌డులోని రక్తనాళాలకు అరుదైన శస్త్ర చికిత్స

1 min read

తీవ్రమైన త‌ల‌నొప్పితో ఆస్పత్రికి వచ్చిన యువతి

మెదడు చుట్టూ రక్తస్రావం సమస్య’ గుర్తించిన వైద్యులు

అత్యాధునిక పద్ధతిలో 6 గంటల పాటు ఆపరేషన్

శ‌స్త్ర చికిత్స‌తో న‌యం చేసిన ‘కిమ్స్ కర్నూలు’ డాక్టర్లు

కర్నూలు, న్యూస్​ నేడు : కర్నూలులోని  కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన, అత్యంత సంక్లిష్టమైన మెదడు శస్త్ర చికిత్సను అధునాతన పద్ధతిలో విజయవంతంగా నిర్వహించారు. తీవ్రమైన తలనొప్పితో ఆస్పత్రికి వచ్చిన ఓ యువతికి ప్రాణాపాయానికి దారితీసే రక్తనాళ సమస్య ఉన్నట్లు గుర్తించి శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను కిమ్స్ కర్నూలు ఆస్పత్రికి  చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డా. కె. అశోక్ రెడ్డి తెలిపారు.యువతి ఆస్పత్రికి వచ్చిన వెంటనే పరీక్షల్లో భాగంగా చేసిన సీటీ స్కాన్‌ చేశాం. సంబంధిత రిపోర్టులో మెదడు చుట్టూ రక్తస్రావం (సబ్‌ అరాక్నాయిడ్ హీమరేజ్ – ఎస్ఏహెచ్) ఉన్నట్లు తేలింది. తదుపరి పరీక్షల్లో మెదడులో రక్తనాళాలు అసాధారణంగా చిక్కుకుని ఉండే ‘ఆర్టీరియోవీనస్ మాల్ఫార్మేషన్’ (ఏవీఎం) ఉన్నట్లు గుర్తించాం. ఆర్టిరియోవీనస్ మాల్ఫార్మేషన్ అంటే .. మెదడు లేదా శరీరంలోని ఇతర భాగాల్లో ధమనులు, సిరలు మధ్య సాధారణంగా ఉండే చిన్న రక్తనాళాలు లేకుండా, నేరుగా కలిసిపోవడం వల్ల ఏర్పడే అసాధారణ రక్తనాళాల ముడి. ఇది ఎప్పుడైనా పగిలి తీవ్ర రక్తస్రావానికి కారణమయ్యే ప్రమాదం ఉంటుంది.’‘ఈ ‘ఏవీఎం’ నిర్మాణం క్లిష్టంగా ఉండటంతో సాధారణంగా ధమనుల ద్వారా చేసే చికిత్సలో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డా. కె. అశోక్ రెడ్డి నేతృత్వంలోని న్యూరో ఇంటర్వెన్షన్ బృందం ‘ట్రాన్స్‌వీనస్ ఎంబోలైజేషన్’ అనే అరుదైన పద్ధతిలో చికిత్స చేయాలని నిర్ణయించుకున్నాం.  ఇందులో ధమనుల మార్గం కాకుండా, రక్తం బయటకు వెళ్లే సిర ద్వారా అసాధారణ రక్తనాళాలను మూసివేసి చికిత్స అందిస్తారు. ఇది సాంకేతికంగా చాలా క్లిష్టమైన విధానం. అయితే ఇప్పుడు కిమ్స్ కర్నూలు ఆస్పత్రిలో అత్యంత నిపుణులైన వైద్య‌బృందం ఉండ‌డంతో పాటు అత్యాధునిక స‌దుపాయాలు కూడా అందుబాటులో ఉండ‌డంతో ఎలాంటి సంక్లిష్టమైన మెద‌డు శ‌స్త్రచికిత్సలైనా ఇక్కడే చేసే వీలుంది. అందువ‌ల్ల  కర్నూలు తో పాటు రాయ‌ల‌సీమ జిల్లాల్లో కూడా ఇలాంటి ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌కు ఇక్క‌డే చికిత్స పొందొచ్చు” అని డాక్టర్ అశోక్ రెడ్డి వివరించారు.

About Author